18.7 C
Hyderabad
Thursday, January 21, 2021

ఏ జాతి కోడి ఎప్పుడు నెగ్గుతుంది..?

పందెం కోళ్లు పందెంలో విజయం సాధించడం ఎలా..? కోడిపుంజుకి సత్తా ఉంటే సరిపోతుందని అనుకుంటున్నారా.. దాంతోపాటు గ్రహాలు కూడా అనుకూలించాలి.
ఏ జాతి కోడి ఎప్పుడు నెగ్గుతుంది..? ఎప్పుడు ఓడిపోతుంది…? అని తెలసుకునేందుకు పందెంరాయుళ్లు కుక్కట శాస్త్రాన్ని ఆశ్రయిస్తరు. దీని ద్వారా ఏ రోజు ఏ జాతి కోడి పందెంలో గెలుస్తుందో ఆ గ్రంథంలో స్పష్టంగా రాసి ఉందట.
గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు ఈ కుక్కట శాస్త్రంపైనే ఆధారపడి పందెం కాస్తారు. ఈ కుక్కుట శాస్త్రం అంత్యంత పురాతనమైనదని, దీనిని శివుడు పార్వతీదేవికి ఉపదేశించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇందులో కోళ్ల భూత, వర్తమాన, భవిష్యత్‌ గురించి వాటి మరణశాసనాల గురించి పొందుపరిచారని పందెం రాయుళ్లు నమ్ముతారు.
కోడి జాతి లక్షణాలకి అనుగుణంగా వాటికి నెమలి, కాకి, డేగ, గూబ, కోడిగా పేరు పెడ్తరు. ఏ వారంలో ఏ కోడి గెలుస్తుంది..? ఏ ఘడియల్లో ఏ నక్షత్రంలో దానిని యుద్ధరంగంలో దించాలనేది ఈ కుక్కుట శాస్త్రంలో వివరంగా రాసి ఉంటుందట.
ఒక్కో నక్షత్రం ఒక్కో జాతి కోడిపై ప్రభావాన్ని చూపిస్తుందని, ఆ నక్షత్ర ప్రభావం వల్ల వాటి బలం మరింత పెరుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది.
ఈ గ్రంథాన్ని అనుసరించే వాళ్లు చాలాసార్లు కోడి పందేలలో విజయం సాధించడంతో కుక్కుట శాస్త్రంపై పందెం రాయుళ్లకి బాగా నమ్మకం పెరిగింది.

- Advertisement -

Latest news

Related news

కొత్త సాగు చట్టాలు.. 18 నెలలపాటు అమలు వాయిదా

కొత్త సాగు చట్టాలకు సంబంధించి రైతు సంఘాల ముందు కేంద్రం కీలక ప్రతిపాదన ఉంచింది. రైతు సంఘాలు లేవనెత్తిన మూడు కీలక చట్టాల అమలును 18 నెలలపాటు నిలిపివేయనున్నట్లు చెప్పింది....

బైడెన్ పట్టాభిషేకానికి బరాక్, క్లింటన్, బుష్

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పట్టాబిషేక కార్యక్రమానికి ఆ దేశ మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా, బిల్ క్లింటన్- హిల్లరీ క్లింటన్‌,...

బైడెన్ తొలి సంతకం వీటిపైనే..

అమెరికా ప్రెసిడెంట్ గా బైడెన్ మరికొన్ని గంటల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. బాధ్యతలు చేపట్టిన మరు క్షణమే గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని వివాదస్పద అంశాలను రద్దు చేస్తూ తొలి సంతకం...

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ఆవిష్కరణ

మిషన్ భగీరథ వాటర్ బాటిల్స్ ని మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మినిస్టర్ ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఇంటింటికి...