29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

వ్యాక్సిన్ ఎవరికి వేస్తారంటే..

రేపటి నుండి దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ప్రజలందరూ వ్యాక్సిన్ల గురించే చర్చించుకుంటున్నారు. వ్యాక్సిన్లు ఎవరికి వేస్తారు.. వేయించుకున్నోళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి అనేక సందేహాలు ప్రజల్లో ఉన్నాయి.

కో-విన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్లు  చేసుకున్న వైద్య సిబ్బందికి మాత్రమే తొలిదశలో వ్యాక్సిన్లు వేయనున్నారు. కేంద్రం అమోదించిన కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ను మాత్రమే తొలిదశలో వినియోగిస్తున్నారు.

తొలుత వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, పోలీసు  సిబ్బందికి వేస్తారు. రెండో దశలో 50 ఏండ్లు దాటినవారికి, అనంతరం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇస్తారు. చివరి దశలో మిగతా ప్రజలకు అందజేస్తారు.

కరోనా సోకిన వారికి వ్యాక్సిన్ వేయరు.  జలుబు, దగ్గు వంటి సాధారణ లక్షణాలు ఉన్నా వ్యాక్సిన్ వేస్తారు.  తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి.. 18 ఏండ్లలోపు వారికి, గర్భిణులకు వ్యాక్సిన్ వేయరు. హెచ్ఐవీ ఉన్నవారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వరు.

- Advertisement -

Latest news

Related news