29.3 C
Hyderabad
Monday, March 1, 2021

కరోనా ఎఫెక్ట్ మన దగ్గర ఎందుకు తక్కువగా ఉందంటే..

ప్రపంచాన్ని గడగడ వణికించిన కరోనా వైరస్.. ఇండియా మీద అంత ప్రభావం చూపలేకపోయిన విషయం తెలిసిందే. వైరస్ దెబ్బకు పాశ్చాత్య దేశాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వ్యాక్సిన్ కోసం ఎదురుచూశాయి. ఇప్పటికీ అమెరికా వంటి దేశాల్లో లక్షల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. మనదేశంలో కరోనా పెద్దగా ఎఫెక్ట్ చూపలేకపోయింది. వైరస్ ఎంతవేగంగా వ్యాపిస్తుందో.. ఎంత మందిని పొట్టన బెట్టుకుంటుందో అని చాలామంది భయపడ్డారు. కానీ.. అదేం జరగలేదు. దీనికి తోడు.. రోజురోజుకు కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. దీనికి కారణమేంటో తెలుసుకోవడానికి.. పశ్చిమ బెంగాల్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయో మెడికల్ జీనోమిక్స్ కు చెందిన సైంటిస్టులు రంగంలోకి దిగారు. వారు చేసిన పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. ఆసియా దేశాలతో పోలిస్తే యూరప్, ఉత్తర అమెరికా దేశాల్లో ప్రొటీన్ లోపం కరోనా వేగంగా వ్యాపించడానికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే.. మనదేశంలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం.
కరోనా వేగంగా వ్యాపించడానికి.. న్యూట్రోఫిల్ ఎలాస్టేస్ అనే ప్రొటీన్ కారణమట. ఈ ప్రొటీన్ మానవ కణాల్లోకి వెళ్లి.. వేగంగా వ్యాప్తి చెంది వైరస్ విస్తరించేలా చేస్తుంది. అయితే.. ఈ ప్రొటీన్‌కు చెక్ పెట్టడానికి మ‌న జీవ వ్యవ‌స్థ మ‌రో ప్రొటీన్‌ను రిలీజ్ చేస్తుంది. దీని పేరు ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ (ఏఏటీ). ఈ ఏఏటీ ప్రొటీన్ భారతీయుల్లో పుష్కలంగా ఉందట. యూరప్, అమెరికావాసుల్లో ఈ ప్రొటీన్ తక్కువగా ఉన్నట్టు తాజా పరిశోధనల్లో తేలింది. అందుకే.. కరోనా వేగంగా వ్యాపించిందట. కరోనా వైరస్ మ్యూటెంట్ అయిన డి614జీ ప్రపంచవ్యాప్తంగా ఒకేలా వ్యాపించలేదని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. ఈ మ్యూటెంట్ 50శాతం వేగంగా వ్యాప్తి చెందడానికి ఆసియా దేశాల్లో ఐదున్నర నెలల సమయం తీసుకోగా.. యూరప్, ఉత్తర అమెరికాలో రెండున్నర నెలల సమయం తీసుకుంది.

- Advertisement -

Latest news

Related news