32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

వింటర్‌లో ఒళ్లు నొప్పులు తగ్గాలంటే..

ఈ చలికాలంలో చలి ముదిరే కొద్దీ కొత్తకొత్త సమస్యలన్నీ వస్తాయి. మామూలుగా వింటర్‌లో జలుబు, దగ్గు, స్కిన్ ప్రాబ్లమ్స్‌తో పాటు కొంతమందికి చలికాలంలో ఒళ్లు నొప్పులు కూడా ఇబ్బంది పెడుతుంటాయి. మరి వాటికి విరుగుడు ఎలా?


చలికాలంలో కొంతమందికి ఉదయం లేవగానే కండరాలు పట్టేయడం, ఒళ్లు నొప్పులు లాంటివి వస్తుంటాయి. ఇవి వింటర్ ఎఫెక్ట్‌తో వచ్చే పెయిన్స్. వీటికి నార్మల్‌గా వేసుకునే పెయిన్‌ కిల్లర్‌లు వేసుకోవడం అంత మంచిది కాదు. అందుకే కొన్నిచిట్కాలతో వీటిని ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం..


చలికాలంలో ఇమ్యూనిటీ కొంచెం వీక్ అవుతుంది. అందుకే వ్యాధులు, నొప్పులు త్వరగా వస్తుంటాయి. ఇలాంటప్పుడు ఆహారంలో వెల్లుల్లి, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.


ఇకపోతే చలికాలంలో దెబ్బలు తగిలితే ఆ బాధ వర్ణనాతీతం. నొప్పి అంత సులువుగా తగ్గకపోగా మరీ ఎక్కువగా నొప్పి పెడుతూ ఉంటుంది. అయితే ఇలాంటి నొప్పుల్ని అల్లంతో తగ్గించుకోవచ్చు.

అల్లంని మొత్తగా గ్రైండ్‌ చేసి ఒక బట్టలో చుట్టి వేడి నీళ్లలో ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత నీటిని పిండేసి వాపు లేదా గాయం ఉన్న చోట పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది.

ముఖ్యంగా చలికాలంలో ఒళ్లు నొప్పులు రాకుండా ఉండాలంటే ఆహారంలో ఫైబర్‌ కంటెంట్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్‌తో కీళ్ల నొప్పులకు, కండరాల నొప్పులకు చెక్‌ పెట్టొచ్చు.


చలికాలంలో యూరిన్ ఎక్కువగా వస్తుందని చాలామంది నీళ్లు సరిగ్గా తాగరు. అయితే తగినంత నీరు తాగకపోవడం కూడా కీళ్ల నొప్పులకు కారణం అవ్వొచ్చు. అందుకే చలికాలంలో కూడా తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి.

ఒక బకెట్‌ గోరువెచ్చని నీటిలో కప్పు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ వేసుకొని స్నానం చేస్తే నొప్పుల నుంచి కాస్త రిలీఫ్ వస్తుంది. అలాగే దాల్చిన చెక్క పొడిని పాలలో వేసుకొని తాగినా కీళ్లనొప్పులు తగ్గించుకోవచ్చు.

అన్నింటికంటే ముఖ్యంగా చలికాలంలో నిద్ర లేచిన తర్వాత ఒళ్లంతా పట్టేసినట్లు ఉంటుంది. కాబట్టి చాలామంది వ్యాయామాన్ని స్కిప్ చేస్తారు. కానీ రోజూ కొంతసేపైనా చేస్తేనే కండరాలు యాక్టివేట్ అవుతాయి. శరీరంలోని ఉష్ణోగ్రత పెరిగి వెచ్చగా ఉంటుంది. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అందుకే చలికాలం వ్యాయామాన్ని మరవకూడదు.

- Advertisement -

Latest news

Related news