32.7 C
Hyderabad
Monday, March 1, 2021

తొలిసారిగా మహిళా పైలట్ సారధ్యంలో..

ప్రతిఏటా రిపబ్లిక్ డే ప‌రేడ్‌లో వైమానిక విన్యాసాలు (ఫ్లైపాస్ట్) జరుగుతాయి. అయితే ఈ సారి ఫ్లైపాస్ట్ లో ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. ఈ రిపబ్లిక్ డే పరేడ్ లో ఫ్లై పాస్ట్ కు ఓ మహిళా పైలట్ నాయకత్వం వహించనున్నారు. అమె ఎవరంటే..


ఈ సారి జరగబోయే వైమానిక విన్యాసాలు మ‌హిళా పైల‌ట్ స్వాతి రాథోడ్ నేతృత్వంలో జరుగనున్నాయి. అంతేకాదు ప్లెపాస్ట్ విన్యాసాలకు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళగా కూడా ఈమె పేరు రికార్డులకెక్కనుంది.


రాజ‌స్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన స్వాతి రాథోడ్.. అజ్మీర్ నుంచి స్కూల్ విద్య పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే పైల‌ట్ కావాల‌ని ఆమె క‌ల‌లు కనేవారు. 2014లో తొలి ప్రయత్నంలోనే ఆమె ఐఏఎఫ్‌కు ఎంపికైంది. స్వాతి సోద‌రుడు నేవీలో, తండ్రి రాష్ట్ర వ్యవసాయ శాఖలో పని చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news