29.3 C
Hyderabad
Monday, March 1, 2021

డేటింగ్ యాప్ లో ఆమె ఏం చేసిందో తెలుసా?

తన వలపులతో వల వేసి.. 16మందిని దోచుకున్నది ఓ కిలాడీ మహిళ. తన అందచందాలతో డేటింగ్ యాప్ లలో మెసేజులు, చాటింగ్ చేసి.. జేబులు ఖాళీ చేసింది.
మహారాష్ట్రలోని పూణేకు చెందిన 27ఏండ్ల మహిళ మొబైల్ సర్వీస్ సంస్థలో పనిచేస్తున్నది. కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఉద్యోగం కోల్పోయింది. ఏం చేయాలో తెలియక.. ఆదాయం కోసం ఓ ఉపాయం ఆలోచించింది. ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ టిండర్, బంబుల్ యాప్స్ లో పలువురితో పరిచయం పెంచుకున్నది. చనువుగా మాట్లాడి.. బుట్టలో పడేసింది. హోటల్ రూమ్ లో కలుద్దామని పిలిపించేది. హోటల్ కి వెళ్లిన తర్వాత మద్యంలో మత్తుమందు కలిపి.. వారి దగ్గర ఉన్న నగదు, డబ్బులు, విలువైన వస్తువులు దోచుకుని.. సైలెన్స్ గా వెళ్లిపోయేది.
గతేడాది.. తన వలపులతో వల వేసి.. 16 మందిని దోచుకున్నది సదరు మహిళ. ఇలా మోసపోయిన చాలామంది పరువు పోతుందని సైలెంట్ గా ఉండిపోతే.. ఆశిష్ కుమార్ అనే బాధితుడు పింప్రిలోని చిన్చ్ వాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆ మహిళను అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.15.25 లక్షల నగదు, విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news