నక్సల్స్ ను ఎదుర్కొనేందుకు సీఆర్పీఎఫ్ కమాండోలతో 2009లో కోబ్రా (కమాండ్ బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్) యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కోబ్రా యూనిట్లో ఇన్నాళ్లూ పురుషులనే తీసుకునేవారు. తాజాగా మహిళా కమాండోలను కోబ్రా యూనిట్ లోకి తీసుకున్నారు.
గురుగ్రామ్‌లోని కదార్‌పుర్‌లో గల సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో 34 మంది సీఆర్పీఎఫ్ యోధురాళ్ల బృందాన్ని కోబ్రా యూనిట్ లో లాంఛనంగా చేరింది. ఈ సందర్భంగా మహిళా కమాండోలు ప్రదర్శించిన యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సీఆర్పీఎఫ్ లోని ఆరు మహిళా బెటాలియన్ల నుంచి 34 మందిని ఎంపిక చేశారు. వీరికి మూడు నెలల పాటు కఠిన శిక్షణ ఇచ్చారు. సుక్మా, దంతెవాడ, బిజాపుర్ లాంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మహిళా కమాండోలు విధులు నిర్వర్తించనున్నారు.