29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఆనాథ వృద్ధుడి శవాన్ని మోసిన మహిళా ఎస్ఐ

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే కాశీబుగ్గ మహిళా ఎస్ఐ శిరీష తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. వృద్ధుడి మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. దీంతో ఎస్ఐ శిరీష స్వయంగా ఇతరుల సాయంతో పొలాల నుంచి మెయిన్ రోడ్డు వరకు మోసుకొచ్చి లలితా చారిటబుల్ ట్రస్ట్ కు ఆప్పజెప్పింది.

సెల్యూట్ చేసిన తెలంగాణ స్టేట్‌ పోలీస్‌

విషయం తెలసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ శిరీషను అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌  డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు తెలంగాణ పోలీస్‌శాఖ అభినందించింది.  మృతదేహాన్ని శిరీష మోసుకెళ్తున్న వీడియోను  ఏపీ  పోలీస్‌శాఖ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ శాఖ ‘ఎంచుకున్న వృత్తికి, వేసుకున్న యూనిఫామ్‌కు చేస్తున్న సేవకి సగర్వంగా చేస్తున్నాం-సెల్యూట్’  అంటూ అభినందించింది.

- Advertisement -

Latest news

Related news