32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

‘క్లిప్’ ఫీచర్ ప్రత్యేకతలేంటంటే..

టిక్ టాక్ రాకతో.. షార్ట్ వీడియోల ట్రెండ్ మొదలైంది. టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత రకరకాల షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ లు పుట్టుకొచ్చాయి. ఇన్‌స్టాగ్రాం రీల్స్, యూట్యూబ్ ‘షార్ట్స్’ కూడా ఇలాంటివే. ఇప్పుడు జనం లాంగ్ వీడియోలు చూడడానికి ఇష్టపడట్లేదు. అందుకే యూట్యూబ్ ఇప్పుడు ‘క్లిప్స్‌’ అనే కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ప్రత్యేకతలేంటంటే..


యూట్యూబ్ క్లిప్స్ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉంది. ట్రయల్స్ లో భాగంగా.. కొంతమంది వినియోగదారులతో పాటు, కొన్ని గేమింగ్ చానల్స్‌కు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది.

యూట్యూబ్ వీడియోస్ ను షేర్ చేయాలంటే కేవలం యూఆర్‌ఎల్ ద్వారానే కుదురుతుంది. యూఆర్ఎల్ పై క్లిక్ చేయగానే పూర్తి వీడియో ప్లే అవుతుంది. అలా కాకుండా.. వీడియోలో మనకు కావల్సిన కొంత క్లిప్ మాత్రమే సెండ్ చేయాలంటే.. ఈ క్లిప్ ఫీచర్ ను వాడాలి. క్లిప్ ఫీచర్ ద్వారా యూట్యూబ్ వీడియోను కట్ చేసి సెండ్ చేయొచ్చు. 5 సెకన్ల నుంచి 60 సెకన్ల నిడివి ఉండేలా వీడియోలు, లైవ్ స్ట్రీమ్స్‌ను మనకు ఇష్టమైన చోటు నుంచి కట్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో వీడియో ఓపెన్ చేసినా తర్వాత కింద లైక్ , షేర్ ఆప్షన్స్ కింద ఈ క్లిప్ ఐకాన్ కనిపిస్తుంది. ప్రస్తుతం బీటా వెర్షన్ లో ఉన్న క్లిప్ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

YouTube begins testing a Twitch-like 'Clips' feature - 9to5Google
- Advertisement -

Latest news

Related news