”ప్రపంచం కీర్తించే ఇండియా సాంప్రదాయం ముసుగులో మలినం ఉంది. సొసైటీ కళ్ళప్పగించి చూసే కళా రంగం వెనక గుండె పగిలే గాయం ఉంది. మనం చూసే ప్రతి అద్బుతం వెనుక మరో నిజం ఒకటి దాగి ఉంది” అంటున్నారు దర్శకుడు తిరుపతి ఎస్ఆర్.
ఉత్తర సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈ దర్శకుడు.. తన రెండో
ప్రయత్నంగా ”హీరోయిన్” అనే సినిమాను రూపొందించబోతున్నారు. టాలీవుడ్లో నాయికగా పలు చిత్రాల్లో నటించిన ఎస్తేర్ ‘హీరోయిన్’ సినిమాలో పోర్న్ స్టార్ పాత్రలో నటిస్తోంది. కథ ప్రకారం ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్లో ఎస్తేర్ బోల్డ్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని ‘లివ్ ఇన్ సి క్రియేషన్స్’ సంస్థ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నిర్మిస్తోంది. త్వరలో షూటింగ్
మొదలుకానుంది.
దర్శకుడు తిరుపతి ఎస్ఆర్ మాట్లాడుతూ…”ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా హీరోయిన్ ను తెరకెక్కిస్తున్నాం. టైటిల్ రోల్లో ఎస్తేర్ క్యారెక్టర్ సాగుతుంది. ఆమె కొన్ని సీన్స్‌లో బోల్డ్‌గా కనిపిస్తుంది. షూటింగ్ సన్నాహాల్లో ఉన్నాం, త్వరలో సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు వెల్లడిస్తాం.” అన్నారు.