32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

కంగనా క్రేజీ ప్రాజెక్ట్.. ‘ది లెజెండ్ ఆఫ్ దిద్దా’

బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ మరోసారి కత్తి తిప్పబోతోంది. వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి పాత్రలో అదరగొట్టిన మణికర్ణిక సినిమాకు సీక్వెల్‌ ప్లాన్ చేసింది కంగనా. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు ‘ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా’ అనే టైటల్ పెట్టారు. భారీ బడ్జెట్‌తో ఈ సీక్వెల్‌ తెరకెక్కనుంది. మణికర్ణిక ప్రొడ్యూసర్ కమల్‌జైన్ ఈ సీక్వెల్‌ని కూడా నిర్మించనున్నారు.

ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. 2022లో ఈ చిత్ర షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ చిత్రంలో కంగనా యోధురాలైన కశ్మీర్ రాణిగా కనిపించనుంది. కథ ప్రకారం కశ్మీర్ రాణి ఒంటికాలితో గజినీమహమ్మద్ ను రెండు సార్లు ఓడిస్తుందట. ప్రస్తుతం కంగనా తేజస్ మూవీలో బిజిగా ఉంది. ఆమె నటించిన జయలలిత బయోపిక్‌ తలైవి ఇటీవలే పూర్తయింది

- Advertisement -

Latest news

Related news