దర్శకుడు రాజ్, డీకే తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ టీజర్ విడుదల అయ్యింది. కుటుంబాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడంలో మనోజ్ వాజ్‌పేయ్ నటన మొదటి సిరీస్‌లో అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు సీజన్ 2లో మరో ట్విస్ట్ ఉంది. ఈ టీజర్ లాస్ట్‌లో సమంత కనిపిస్తుంది. ఇందులో సమంత టెర్రరిస్ట్ పాత్రలో నటించింది. ప్రస్తుతం స్టార్స్ అంతా ఓటీటీల వైపు అడుగేస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు సమంత కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ సిరీస్ ట్రైలర్ ఈ నెల 19న విడుదల అవుతుంది.
