22.6 C
Hyderabad
Thursday, August 13, 2020

అదరగొట్టిన ఇంగ్లాండ్…

నాలుగు నెలల కరోనా విరామం తర్వాత జరిగిన టెస్టు సిరీస్ లో  ఇంగ్లాండ్ అదరగొట్టింది. విండీస్‌ తో ముగిసిన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ ను ఆతిథ్య జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుని.. విజ్డెన్‌ ట్రోఫీని సొంతం చేసుకుంది. మూడో టెస్టులో భాగంగా 390 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ లో బరిలోకి దిగిన కరేబియన్ టీం  కేవలం 129 పరుగులకే  కుప్పకూలింది. దీంతో 269 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ భారీ విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 5 వికెట్లతో రాణించగా, బ్రాడ్‌ మరోసారి 4 వికెట్లు పడగొట్టాడు.

ఓవర్ నైట్ స్కోర్తో ఇదో రోజు ఆట కొనసాగించిన విండీస్ బ్యాట్స్‌ మన్‌.. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. క్రెయిగ్‌ బ్రాత్‌ వైట్, షై హోప్, షమర్ బ్రూక్స్ తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. లంచ్ సమయానికి విండీస్ 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. అప్పటికీ విండీస్ విజయం సాధించాలంటే ఇంకా 315 పరుగులు చేయాలి. అయితే లంచ్ అనంతరం మధ్యమధ్యలో చిరుజల్లుల కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆపై ఆట మొదలు కాగా.. వోక్స్‌ చెలరేగడంతో విండీస్ కొద్దిసమయంలోనే కుప్పకూలింది.

కరోనా నేపథ్యంలో మైదానంలో ప్రేక్షకులు లేకుండానే జరిగిన ఈ సిరీస్‌ విజయవంతం కావడంతో క్రికెట్‌కు సరికొత్త ఊపునిచ్చింది. మొదటి టెస్టులో   విండీస్‌ అద్భుతమైన విజయం సాధించి ఇంగ్లండ్‌ కు గట్టి షాక్‌ ఇచ్చింది. అయితే రెండో టెస్టులో ఫుంజుకున్న ఆతిథ్య జట్టు విండీస్‌పై 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మకంగా మారిన మూడో టెస్టుకు వరుణుడు అడ్డు తగిలినా ఇంగ్లండ్‌ బౌలర్ల అద్భుత బౌలింగ్‌తో ఆతిథ్య జట్టు ట్రోపీని ఎగరేసుకుపోయింది.                   

ఈ సిరీస్ లో  ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ చెలరేగిపోయాడు. రెండో టెస్టులో 6 వికెట్లు, మూడో టెస్టులో ఫాస్టెస్ట్‌ ఆఫ్‌ సెంచరీతో పాటు 10 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేగాక బ్రాత్ వైట్ ను వికెట్ తో ​కెరీర్‌లో 500 వికెట్లు సాధించిన రెండో ఇంగ్లండ్‌ బౌలర్‌గా, ప్రపంచంలో 7వ బౌలర్‌గా ఘనత సాధించాడు. 2017 లో జేమ్స్ అండర్సన్ తీసుకున్న  500 వికెట్ కూడా బ్రాత్ వైట్ దే కావటం విశేషం.

- Advertisement -

Latest news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

Related news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

టాంజానియాలో భారీ భూకంపం..

టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. దారస్‌ ఎస్‌ సలామ్‌ కి 80కిమీ దూరంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 6.0గా...

మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...

హెచ్‌1బీ వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌

అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ట్రంప్‌ కాస్త మెత్తబడ్డారు. ఇన్నాళ్లు హెచ్‌1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన కార్పొరెట్‌ దిగ్గజాల వ్యతిరేకతతో దిగొచ్చారు. నీషేదం గడవు కంటే ముందే ...