ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో మిగిలిన రెండు టెస్టులకు స్టార్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ గాయాలతో దూరమయ్యాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ సందర్భంగా రాహుల్ గాయపడినట్టు బీసీసీఐ తెలిపింది. మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ గాయాల కారణంగా ఇప్పటికే టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్టులకు దూరమైన రోహిత్ శర్మ మూడో టెస్టు మ్యాచ్ కు వైస్ కెప్టెన్గా వ్యవహారించనున్నారు.
బార్డర్-గవాస్కర్ టెస్టు ట్రోఫీలో మూడో టెస్టు జనవరి 7 నుంచి ప్రారంభం కానుంది. నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్లో ప్రారంభ మ్యాచులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా గెలుపొందగా, రెండో టెస్టులో ఇండియా విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే.