18.8 C
Hyderabad
Monday, January 18, 2021

ఐపీఎల్‌లో బెంగళూరుపై గెలిచిన పంజాబ్‌

ఐపీఎల్ 13వ సీజన్ లో పంజాబ్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీతో జరిగి మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ ను విజయం వరించింది. లాస్ట్ బాల్ కు ఒక్క పరుగు కావాల్సిన స్థితిలో  నికోలస్ పూరన్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు.  

ఫస్ట్ బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ సేన.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 48 పరుగులతో ఒంటరి పోరాటం చేశారు. ఆఖర్లో క్రిస్‌ మోరీస్‌ 8 బంతుల్లో 25 పరుగులతో ధనాధన్‌ బ్యాటింగ్‌ చేయడంతో జట్టు స్కోరును 170 పరుగులు దాటింది. ఆరోన్‌ ఫించ్‌, శివమ్‌ దూబే ఫర్వాలేదనిపించారు. బౌలర్లలో మహ్మద్‌ షమీ, మురుగన్‌ అశ్విన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, అర్షదీప్‌ సింగ్‌, క్రిస్‌ జోర్డాన్‌లు చెరో వికెట్‌ తీశారు. 

ఆ తర్వాత 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 78 పరుగులు జోడించారు. 45 పరుగులు చేసిన మయాంక్ ను చాహల్ ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గేల్ తొలుత నెమ్మదిగా ఆడినా తర్వాత సిక్స్‌ లతో రెచ్చిపోయాడు. 45 బంతుల్లో  53 పరుగులు సాధించాడు. అటు రాహుల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సొగసైన షాట్లతో అలరించాడు. పంజాబ్ విజయం వైపు సాగుతున్న సమయలో.. ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. చివరి ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు రెండు పరుగులు అవసరం కాగా, చహల్‌ తొలి నాలుగు బంతులకు ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. ఐదో బంతికి గేల్‌ రనౌట్‌ అయ్యాడు. దాంతో ఉత్కంఠ ఏర్పడింది. కానీ పూరన్‌ సిక్స్‌ తో ఇన్నింగ్స్‌ ను ఫినిష్‌ చేశాడు.

హాఫ్ సెంచరీతో రాణించి జట్టును గెలిపించిన కెప్టెన్ కేఎల్ రాహుల్ కు మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ సీజన్ లో బెంగుళూరుతో రెండు మ్యాచులాడిన పంజాబ్ ..రెండింటిలోనూ విజయాన్ని నమోదు చేసింది.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...