ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ తొలిసారి టాప్ ర్యాంకులో నిలిచింది. పాకిస్థాన్ తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో నెగ్గడం ద్వారా కివీస్ ఈ ఘనతను సాధించింది. 118 పాయింట్లు సాధించిన న్యూజిలాండ్ మొదటి ర్యాంక్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (116), ఇండియా (114), ఇంగ్లాండ్ (106), సౌతాంప్రికా (96), శ్రీలంక (86), పాకిస్థాన్ (82), వెస్టిండీస్ (77), ఆఫ్ఘనిస్తాన్ (57), బంగ్లాదేశ్ (55) ఉన్నాయి.
176 రన్స్ తేడాతో విజయం
పాకిస్థాన్‌తో జరిగిన రెండవ టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 176 రన్స్ తేడాతో విజయం సాధించింది. కివీస్ బౌలర్ కైల్ జేమిసన్ ఆరు వికెట్లు తీసుకుని పాకిస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. తొలి టెస్టులో సెంచరీ, రెండవ టెస్టులో డబుల్ సెంచరీతో సహా 338 రన్స్ చేసిన కేన్ విలియమ్సన్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. రెండో టెస్లులో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 659-6 చేసి డిక్లేర్డ్ చేయగా పాక్ 297, 186 చేసి ఓటమిపాలైంది.