19.4 C
Hyderabad
Monday, November 30, 2020

కోల్​కతాపై చెన్నై విజయం

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్‌లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో కోల్​కతాపై చెన్నై విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లేఆఫ్స్‌ కు అర్హత సాధించలేకపోయిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోతూ పోతూ కోల్‌ కతాను తమతో పట్టుకుపోతోంది. ఈ మ్యాచ్‌ ఓటమితో కోల్‌కతా ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి.

తొలుత టాస్‌ గెలిచిన చెన్నై ప్రత్యర్థి కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పవర్‌ప్లేలో విఫలమవుతూ వస్తున్న కోల్‌కతాకు ఈసారి మంచి ఆరంభమే లభించింది. గిల్‌, రాణా కలిసి ఈ సీజన్‌లో తొలిసారి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల కోల్‌కతా వేగంగా పరుగులు చేయలేకపోయింది. గిల్‌ 26, కార్తిక్‌ 21 పరుగులతో పర్వాలేదనిపించారు. ఆ తర్వాత వచ్చిన నరైన్‌, రింకూ సింగ్‌ వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. వరుసగా వికెట్లు పడుతున్నా రాణా మాత్రం స్కోరు బోర్డును పరుగులు పెట్టించి.. 61 బంతుల్లో 87 పరుగులతో మెరిశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు తీయగా.. కర్ణ్​ శర్మ, జడేజా, శాంట్నర్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

173 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన చెన్నై జట్టు ఓపెనర్లు వాట్సన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ మంచి ఆరంభాన్నిచ్చారు. భాగస్వామ్యం 50 పరుగులు పూర్తి చేశాక.. వాట్సన్‌ 14 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరో ఎండ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌తో కలిసి తర్వాత క్రీజులోకి వచ్చిన రాయుడు ఎడాపెడా బౌండరీలు బాదాడు. ఆ తర్వాత 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కమిన్స్‌ బౌలింగ్‌లో నరైన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చి ధోనీని చక్రవర్తి బోల్తా కొట్టించాడు. బంతిని సరిగా అంచనావేయలేకపోయిన ధోనీ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. చెన్నై విజయానికి 15 బంతుల్లో 33 పరుగులు అవసరమైన సమయంలో గైక్వాడ్‌ 72 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆఖర్లో జడేజా ఎప్పటిలాగే మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరి ఓవర్లో 10 పరుగులు అవసరం కాగా క్రీజులో ఉన్న జడేజా ఆఖరి రెండు బంతులకు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 72 పరుగులతో చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించిన రుతురాజ్‌ కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.