24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

కోల్‌కతాపై బెంగళూరు ఘన విజయం

కోహ్లీ సేన మరోసారి కమాల్ చేసింది. బౌలింగ్,  బ్యాటింగ్ లో సూపర్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఏక పక్షంగా సాగిన మ్యాచ్ లో కోల్ కతాపై 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.

మోర్గాన్ సేన విసిరిన 84 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. 14 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను  రీచ్ అయింది. లక్ష్య ఛేదనలో ఓపనర్లు పడిక్కల్, ఫించ్ శుభారంభాన్ని అందించారు. ఇద్దరు మొదటి వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  అయితే పెర్గ్యూసన్ వేసిన ఏడో ఓవర్ లో ఫించ్ ఔటవ్వగా అదే  ఓవర్ లో పడిక్కల్ రనౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేప్టెన్ కోహ్లీ…గురుకిరీత్ సింగ్ తో కలిసి మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. కోల్ కతా బౌలర్లలో పెర్గ్యూసన్ ఒక వికెట్ తీశాడు.  

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా… 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయిన కేవలం 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ మోర్గన్ 30 పరుగులతో రాణించాడు. 19 పరుగులతో పెర్గ్యూసన్ పర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్  దారుణంగా విఫలమయ్యారు. దీనికి తోడు.. బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్  కోల్ కతా టాప్ ఆర్డర్ ను దెబ్బతీశాడు. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఓవర్లు మెయిడిన్ కావడం విశేషం. సిరాజ్ కు  స్పిన్నర్ చాహల్ 2 వికెట్లు తీసి సహకరించాడు.

ఎండ్ వాయిస్- అద్భుతమైన బౌలింగ్ తో కోల్ కతా నడ్డివిరిచిన మహ్మద్ సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ఓవరాల్ గా 14 పాయింట్లు సాధించిన బెంగుళూరు..పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.  

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...