ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. సిడ్నీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు 50 శాతం మంది ప్రేక్షకులు హాజరు కానున్నారు. చాలా రోజుల తర్వాత మంచి సమరం జరగనున్న నేపథ్యంలో క్రికెట్ లవర్స్ ఈ మ్యాచ్‌పై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు.
భారత్ టీం: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా, చాహల్
ఆస్ట్రేలియా టీం: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టీవెన్ స్మిత్, లబుషేన్, స్టోనిస్, క్యారీ, మ్యాక్స్‌వెల్, కమ్మిన్స్, స్టార్క్ , జంపా, హాజిల్ వుడ్