17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

ఢిల్లీపై పంజాబ్ విజ‌యం

పంజాబ్ మరోసారి పంజా విసిరింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. శ్రేయాస్ సేన విసిరిన 165 పరుగుల టార్గెట్ ను 19 ఓవర్లలో ఛేదించి..హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. స్టార్టింగ్ లోనే వికెట్ ను కోల్పోయింది. నీషమ్‌ బౌలింగ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో ధావన్ కు  కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జత కలిశాడు. వీరిద్దరూ 48 పరుగులు జత చేసిన తర్వాత అయ్యర్‌.. రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై కొద్దిసేపటికే రిషభ్‌ పంత్‌ కూడా ఔటయ్యాడు. ఓ వైపు వికెట్లు పడినా.. ధావన్‌ మాత్రం షాట్లతో విరచుకుపడ్డాడు. 57 బంతుల్లో12 ఫోర్లు, 3 సిక్సర్లతో  సెంచరీని సాధించాడు. చివర్లో స్టోయినిస్‌, హెట్‌మెయిర్‌ విఫలమవడంతో.. ఢిల్లీ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులే చేసింది. పంజాబ్‌ బౌలర్లలో షమీ రెండు వికెట్లు సాధించగా, నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌, మ్యాక్స్‌ వెల్‌ తలో వికెట్‌ తీశారు.

165 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కు ఆరంభం అంత మంచిగా లభించలేదు. కెప్టెన్ రాహుల్..15 పరుగులే చేసి నిష్ర్కమించాడు. అయితే సిక్సుల వీరుడు గేల్ ధాటిగా ఆడి 13 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. గేల్ ఔటైన తర్వాత వచ్చిన మయాంక్.. రనౌట్ గా పెవీలియన్ చేరాడు. ఈ దశలో పూరన్.. జట్టును గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. సిక్సులు , ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి మ్యాక్స్‌ వెల్‌ సహకారం అందించాడు. ఈ జోడి నాల్గో వికెట్‌కు 69 పరుగులు జోడించడంతో పంజాబ్‌ విజయం దిశగా పయనించింది. స్కోరు 125 పరుగుల వద్ద ఉండగా పూరన్‌ ఔటయ్యాడు. ఈ వెంటనే 147 పరుగుల వద్ద మ్యాక్స్‌ వెల్‌ కూడా పెవీలియన్ చేరాడు. వీరిద్దరు ఔటైనా…చివర్లో దీపక్‌ హుడా, నీషమ్‌ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఢిల్లీ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు సాధించగా, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు తలో వికెట్‌ లభించింది.

శతకంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించిన శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో 8 పాయింట్లు సాధించిన పంజాబ్..ఫ్లే ఆఫ్‌ కు మరింత చేరువైంది.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...