19.5 C
Hyderabad
Friday, November 27, 2020

ఢిల్లీపై హైదరాబాదీల విజయం

తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ని చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్‌.. నిర్ణిత ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 219 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. వృద్ధిమాన్ సాహా, డేవిడ్ వార్నర్‌లు మెరుపు హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ.. 19 ఓవర్లలో 131 పరుగులకు  కుప్పకూలింది. రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీసి ఢిల్లిని ఘోరంగా దెబ్బతీశాడు.  

టాస్ ఓడి బ్యాటింగ్‌ కు దిగిన వార్నర్‌ సేనకు మంచి ఆరంభం దక్కింది. తొలి ఓవర్ నుంచే సాహా, వార్నర్ దూకుడుగా ఆడారు. పవర్‌ ప్లే లో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేశారు. రబాడ వేసిన ఆరో ఓవర్‌లో వార్నర్ నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ బాది 22 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే 25 బంతుల్లో వార్నర్ అర్థశతకం పూర్తి చేశాడు. 34 బంతుల్లోనే 66 పరుగులు చేసిన వార్నర్..   అశ్విన్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో 107 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

వార్నర్ ఔటైన తర్వాత కూడా సాహా తన దూకుడు కొనసాగించాడు. ఈ క్రమంలోనే 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 45 బంతుల్లో 87 పరుగులు చేసిన సాహా..  నోర్జే బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆఖర్లో మనీష్‌ పాండే భారీ షాట్స్‌తో సన్‌ రైజర్స్‌ స్కోర్‌ పరుగులు పెట్టింది. దీంతో నిర్ణిత ఓవర్లలో హైదరాబాద్‌ 219 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అశ్విన్, నోర్జె చెరో వికెట్ తీశారు.

టార్గెట్ చేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలిఓవర్ లోనే షాక్ తగిలింది. సందీప్ శర్మ బౌలింగ్ లో మూడో బంతికే శిఖర్ ధావన్ వన్‌ గోల్డెన్ డక్ అయ్యాడు. తరువాత ఐదు పరుగులు చేసిన వెంటనే స్టాయినిస్ పెవిలియన్ చేరాడు. దీంతో 14 పరుగులకే ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది, ఈ దశలో బ్యాటింగ్‌ కు వచ్చిన హెట్‌ మైయర్.. రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే 7వ ఓవర్‌లో రషీద్ ఖాన్ వాళ్లిద్దరిని పెవిలియన్ పంపించి ఢిల్లీని దెబ్బతీశాడు. తర్వాత బౌలర్లు వెనువెంటనే వికెట్లు తీస్తూ మ్యాచ్‌పై పట్టు బిగించారు. మరో ఎండ్‌లో రిషబ్ పంత్ బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే 17వ ఓవర్లో పంత్‌ను సందీప్‌ శర్మ ఔట్‌ చేసి స్కోర్ కు కళ్లెం వేశాడు. హైదరాబాద్‌ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు, సందీప్ శర్మ, నటరాజన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. విజయ్ శంకర్, హోల్డర్, నదీమ్‌ తలో వికెట్ తీశారు.

హైదరాబాద్ బౌలర్రషీద్‌ ఖాన్ ఈ సీజన్‌లోనే అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు   నమోదు చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అటు 45 బంతుల్లో 87 పరుగులు చేసిన హైదరాబాద్ ఓపెనర్ వృద్ధిమాన్‌ సాహా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఢిల్లీపై విజయంతో సన్‌ రైజర్స్‌ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో విజయం సాధించటంతో ఇతర జట్ల విజయంపై ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...