24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం

ఐపీఎస్‌-13లో రాజస్థాన్‌ రాయల్స్‌ గ్రాండ్‌ విక్టరీ సాధించింది. ఫ్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌పై ఘన విజయం సాధించింది. కింగ్స్‌ పంజాబ్‌ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 17.3 ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో స్టోక్స్‌, ఊతప్పలు రాజస్తాన్‌ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 5.3 ఓవర్లలో 60 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు మంచి అరంభాన్ని అందించింది. ప్రధానంగా  స్టోక్స్‌ దూకుడుగా ఆడి విలువైన పరుగులు సాధించాడు. హాఫ్‌ సెంచరీ సాధించిన తర్వాత స్టోక్స్‌ ఔట్‌ అయ్యాడు. ఆ తర్వాత ఊతప్ప, సంజూ శాంసన్‌లు స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. సంజూ శాంసన్‌ 48 పరుగులతో రాణించాడు. వారికి తోడు రాబిన్‌ ఊతప్ప 30 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చివర్లో స్టీవ్‌ స్మిత్‌ 31 రన్స్‌తో నాటౌట్‌గా నిలవగా.. బట్లర్‌ 22 పరుగులతో బ్యాట్‌ ఝుళిపించడంతో రాజస్తాన్‌ 15 బంతులు ఉండగానే ఘన విజయం సాధించింది. పంజాబ్‌ బౌలర్లలో జోర్డాన్‌, అశ్విన్‌ తలొ వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌, 63 బంతుల్లో 99 పరుగులతో చేలరేగాడు. కేఎల్‌ రాహుల్‌తో కలిసి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. కేఎల్ రాహుల్‌ 46 పరుగులతో రాణించగా.. నికోలస్‌ పూరన్‌ 22 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అటు పంజాబ్‌ ఇన్నింగ్స్ ను రాహుల్‌, మన్‌దీప్‌ సింగ్‌లు ఆరంభించగా.. ఆడిన తొలి బంతికి మన్‌దీప్‌ సింగ్‌ డకౌట్‌ అయ్యాడు. ఆర్చర్‌ వేసిన తొలి ఓవర్‌ ఆఖరి బంతికి మన్‌దీప్‌.. స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం పంజాబ్‌ ఇన్నింగ్స్‌ను రాహుల్‌, గేల్‌లు ముందుకు నడిపించారు. ముఖ్యంగా  రాహుల్‌ ఔటైన తర్వాత గేల్‌ చెలరేగి ఆడాడు. పూరన్‌తో కలిసి 41 పరుగుల భాగస్వామ్యం, మ్యాక్స్‌వెల్‌తో కలిసి 22 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు. కాగా, సెంచరీ పరుగు దూరంలో గేల్‌ షాట్‌ ఆడబోయి ఔటయ్యాడు. ఆర్చర్‌ వేసిన ఆఖరి ఓవర్‌ నాల్గో బంతి గేల్‌ బ్యాట్‌ను తాకి వికెట్ల ను పడగొట్టడంతో  పెవిలియన్‌ చేరాడు. రాజస్థాన్‌ బౌలర్లలో ఆర్చర్‌, స్టోక్స్‌ తలొ రెండు వికెట్లు  పడగొట్టారు.

రాజస్తాన్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన బెన్ స్టోక్స్‌ కు ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు దక్కింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ ఐదో స్థానానికి చేరింది..

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...