24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

ఫైనల్లో ఢిల్లీపై ముంబై అద్భుత విజయం

ఐపీఎల్‌ పదమూడోవ సీజన్‌ విజేతగా ముంబై ఇండియన్స్‌ నిలిచింది.  తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ముంబై ఐదోసారి టైటిల్‌ గా  సాధించింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి ట్రోఫిని కైవసం చేసుకుంది.  తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. బౌల్ట్‌ బౌలింగ్‌ దెబ్బకు ఢిల్లీ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. తొలుత ఈ జోడి నిదానంగా ఆడినప్పటికీ చివర్లో బౌండరీల మోత మోగించింది.  ఢిల్లీ బ్యాటింగ్‌ లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, పంత్‌ మినహా ఎవ్వరూ కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. శ్రేయస్‌ అయ్యర్‌ 65, పంత్‌ 54 పరుగులతో రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్‌ మూడు వికెట్లు సాధించగా  కౌల్టర్‌ నైల్‌ రెండు వికెట్లు తీశాడు. జయంత్‌ యాదవ్‌కు వికెట్‌ దక్కింది.

టార్గెట్‌ ను ఛేదించే క్రమంలో డీకాక్‌-రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ ను స్టార్ట్‌ చేశారు.  వీరిద్దరూ ఆది నుంచి ఢిల్లీ బౌలర్లపై విరుచుకపడటంతో ముంబై స్కోరు పరుగులు పెట్టింది. స్టోయినిస్‌ వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి డీకాక్‌ 20 పరుగులు చేసి ఔటయ్యాడు. దాంతో 45 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రోహిత్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ జత కలిశాడు. ఈ జోడి 45 పరుగులు చేసిన తర్వాత సూర్యకుమార్‌ రనౌట్‌ అయ్యాడు. అటు తర్వాత రోహిత్‌- ఇషాన్‌ కిషన్‌ తో కలిసి 47 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ముంబై స్కోరు 137 పరుగుల వద్ద ఉండగా రోహిత్‌ మూడో వికెట్‌గా ఔట్‌ కాగా, పొలార్డ్‌ నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. హార్దిక్‌ పాండ్యా సైతం నిరాశపరిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కృనాల్‌ పాండ్యా సింగల్‌ తీసి ముంబైకి విజయాన్ని అందించాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్జె రెండు, రబాడ, స్టోయినిస్‌ చెరో వికెట్‌ తీశారు.

తాజాగా విక్టరీతో ఐపీఎల్‌ లీగ్‌ లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టుగా ముంబై రికార్డు సాధించింది. మొత్తం ఐదు సార్లు ముంబై ఐపీఎల్ ట్రోఫీని గెలిచి రికార్ట్  సృష్టించింది. మూడు ట్రోఫీలతో చెన్నై రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌ లో కేఎల్‌ రాహుల్‌ అత్యధికంగా 670 పరుగులు సాధించాడు. ఢిల్లీ బౌలర్‌ రబాడ అత్యధికంగా 30 వికెట్లు తీశాడు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...