24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

బెంగళూరుపై ఢిల్లీ విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపింది. అద్భుతమైన ఆటతీరుతో ప్లేఆఫ్ కు దూసుకెళ్లింది. బ్యాటింగ్,  బౌలింగ్ లో చెలరేగి.. కోహ్లీసేనపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 6 బంతులుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 16 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.

ముందుగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి రబడా ఆరంభంలోనే షాకిచ్చాడు. జట్టు స్కోరు 25 పరుగుల వద్ద ఫిలెప్పీని  పెవిలియన్‌ చేర్చాడు. ఈ స్థితిలో కెప్టెన్ కోహ్లీ.. పడిక్కల్‌ ఇన్నింగ్స్ ను  చక్కదిద్దారు. వికెట్లు కాపాడుకుంటూ 57 పరుగులు జత చేశారు. అయితే కెప్టెన్ కోహ్లీని అశ్విన్‌ బుట్టలో వేసుకున్నాడు.  13 వ ఓవర్‌ మూడో బంతికి భారీ షాట్‌ ఆడిన కోహ్లి.. స్టోయినిస్‌ కు చిక్కాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన డివిలియర్స్‌ చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే పడిక్కల్‌తో కలిసి 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 16వ  ఓవర్‌  లో నోర్జే ..పడిక్కల్‌ను  బౌల్డ్‌ చేయడంతో వీరి జోడి విడిపోయింది. అదే ఓవర్‌ చివరి బంతికి క్రిస్‌ మోరిస్‌  కూడా డకౌట్‌ అయ్యాడు. ఇక చివర్లో డివిలియర్స్‌, శివం దూబేతో కలిసి బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జే మూడు వికెట్లు సాధించగా, రబడా రెండు వికెట్లు తీశాడు. అశ్విన్‌కు ఒక వికెట్‌దక్కింది.

ఇక 153 పరుగుల టార్గెట్ తో ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసిన ఢిల్లీ ఆరంభంలోనే పృథ్వీ షా వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ ఆచితూచి ఆడాడు. అజింక్యా రహానేతో కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు. ఈ క్రమంలోనే ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే స్కోరు 107 పరుగుల వద్ద ధావన్‌ పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌ 7 పరుగులే చేసి ఔట్ అయ్యాడు. కొద్దిసేపటికే రహానే కూడా నిష్క్రమించాడు. 18 వ ఓవర్‌ రెండో బంతికి వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్ లో పెవిలియన్‌ చేరాడు. చివర్లో పంత్‌, స్టోయినిస్‌ మరో వికెట్ పడకుండా ఆడి..జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ విజయంతో 16 పాయింట్లు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అటు మ్యాచ్ లో ఓడినప్పటికీ ఆర్సీబీ.. ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. ఢిల్లీ తన విజయాన్ని 19 ఓవర్ల వరకూ తీసుకురావడంతో కోహ్లీసేన ప్లేఆఫ్ కు చేరింది.  ప్రస్తుతం తొలి రెండు స్థానాల్లో ముంబై, ఢిల్లీ ఉండగా.. మూడో స్థానంలో ఆర్సీబీ నిలిచింది. ఇక రేపటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిస్తే ప్లేఆఫ్ కు చేరడంతో పాటు..మూడో స్థానాన్ని దక్కించుకుంటుంది. ఒకవేళ సన్‌రైజర్స్‌ ఓడితే కోల్ కతాకు  ప్లేఆఫ్ అవకాశం ఉంటుంది.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...