20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

మరో రెండేండ్లు వీరిదే

  • టెస్టుల్లో ప్రస్తుత పేస్‌ దళం ప్రదర్శన అద్భుతం 
  • భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మతో కూడిన భారత పేస్‌ చతుష్టయం అద్భుత ప్రదర్శన చేస్తున్నదని టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ అన్నాడు. కనీసం మరో రెండేండ్ల పాటు ఆ పేస్‌ దళం భారత జట్టులో కొనసాగుతుందని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో  చెప్పాడు. ‘ప్రస్తుత పేస్‌ దళం అద్భుతంగా రాణిస్తున్నది. ఒకవేళ నలుగురు ఫిట్‌గా ఉంటే బృందంగా వారిని కనీసం మరో రెండేండ్ల పాటు కొనసాగించడంలో మాకు ఎలాంటి సమస్య కనిపించడం లేదు. అలాగే మరికొందరు ప్రతిభావంతులైన పేసర్లను గుర్తించాల్సిన అవసరం ఉంది. దీంతో బెంచ్‌ బలం పెరుగడంతో పాటు తర్వాత ఎవరన్న సందిగ్ధత ఉండదు. 

అలాగే ఎక్కువ మంది మంచి పేస్‌ బౌలర్లు అందుబాటులో ఉంటే పనిభారం ఎక్కువైనప్పుడు రొటేషన్‌ పద్ధతిని అమలు చేయవచ్చు. ముఖ్యమైన సిరీస్‌లకు స్టార్‌ పేసర్లను సిద్ధంగా ఉంచొచ్చు. కాంట్రాక్టు పరిధిలో ఉన్న స్పీడ్‌ బౌలర్లందరూ క్యాంప్‌ లో ఉండాలని నేను అనుకుంటా. అలాగే దేశవాళీ క్రికెట్‌, భారత్‌-ఏ తరఫున రాణిస్తున్న పేసర్లు, స్పిన్నర్లు కూడా ఉండాలనుకుంటా. బౌలర్లు ఉమ్మిని ఉపయోగించే అలవాటును దూరం చేసుకోవడం కాస్త కష్టం. ప్రాక్టీస్‌ సమయంలో ఈ విషయంపై బౌలర్లు ప్రత్యేక దృష్టిసారించేలా చూస్తాం’ అని భరత్‌ అరుణ్‌ చెప్పాడు. 

కనీసం ఆరువారాలు 

క్రికెట్‌ పునఃప్రారంభమయ్యాక.. మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవ్వాలంటే ఆటగాళ్లకు కనీసం ఆరు వారాల ప్రాక్టీస్‌ అవసరమని భరత్‌ అరుణ్‌ అభిప్రాయపడ్డాడు. టెస్టుల కోసం మరింత ఎక్కువ సమయం పట్టొచ్చని అన్నాడు. 

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...