24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

ముంబై పై హైదరాబాద్ విజయం…

గెలిస్తే ప్లే ఆఫ్‌ కు..లేదంటే ఇంటికి. ఇది ఐపీఎల్ 13వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి. ఈ స్థితిలో వార్నర్ సేన జూలు విదిల్చింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరును కనబర్చింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణిస్తూ.. ముంబై ఇండియన్స్ పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ప్లే ఆఫ్ లో సగర్వంగా అడుగుపెట్టింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మమూడో ఓవర్ లోనే పెవిలియన్ చేరాడు. ఈ దశలో సూర్యకుమార్, డికాక్ లు జట్టును ఆదుకున్నారు.  వరుస సిక్సులతో స్పీడ్ పెంచిన డికాక్.. కాసేపటికే బౌల్డ్ అయ్యాడు. ఇక సూర్యకుమార్ కు ఇషాన్ కిషన్ జతకలవడంతో స్కోరు ముందుకు కదిలింది. అయితే 36 పరుగులు చేసిన సూర్యకుమార్ ను వృద్ధిమాన్ సాహా స్టంపౌట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన కృనాల్‌ పాండ్యా అదే ఓవర్ లో నాల్గో బంతికి డకౌట్‌ అయ్యాడు. ఇక రషీద్‌ వేసిన 13 ఓవర్‌ తొలి బంతికి సౌరవ్‌ తివారీ  ఔటయ్యాడు. ఫలితంగా ఒక పరుగు వ్యవధిలో ముంబై ఇండియన్స్‌ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో ఇషాన్‌ కిషన్‌-పొలార్డ్‌ లు స్కోరును చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 33 పరుగులు చేసింది. అయితే సెట్ అయ్యాడు అనుకున్న సమయంలో ఇషాన్‌ కిషన్‌ ఆరో వికెట్‌గా నిష్క్రమించాడు. 18 ఓవర్‌ లో కౌల్టర్‌ నైల్‌ ఔటయ్యాడు. అయితే చివర్లో పొలార్డ్‌ మెరుపులు మెరిపించాడు.  19 ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌ లు.. ఆఖరి ఓవర్‌లో మరో సిక్స్‌ కొట్టడంతో..ముంబై ఇండియన్స్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ మూడు వికెట్లు సాధించగా, నదీమ్‌,హోల్డర్‌ చెరో రెండు వికెట్లు తీశాడు. రషీద్‌ ఖాన్‌కు ఒక వికెట్‌ దక్కింది.

150 పరుగుల టార్గెట్ ను సన్ రైజర్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. కేవలం 17.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్లు వార్నర్ 85 పరుగులు, సాహా 58 పరుగులతో  చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించారు.

కీలక వికెట్లు తీసుకుని ముంబై ఇండియన్స్ నడ్డివిరిచిన నదీమ్ కు మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో 14 పాయింట్లు సాధించడంతో పాటు మెరుగైన రన్ రేట్ కారణంగా… సన్‌రైజర్స్‌ మూడో స్థానానికి చేరింది.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...