24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

రాజస్థాన్‌పై హైదరాబాద్‌ విజయం

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌ రౌండ్‌ పర్‌ఫామెన్స్‌ తో అదరగొట్టింది. ఫ్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్.. ధాటిగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కానీ ఉతప్ప ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్.. స్టోక్స్​తో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నాడు. కానీ కొద్ది బంతుల తేడాతో వీరిద్దరూ పెవిలియన్​ చేరారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్​మెన్​లో అందరూ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. నిర్ణీత ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్ 3, రషీద్ ఖాన్, విజయ్ శంకర్ తలో వికెట్ పడగొట్టారు.

155 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన హైదరాబాద్.. మూడు ఓవర్లలోపే ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో వికెట్లో కోల్పోయింది. 16 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ హైదరాబాద్‌ను మనీశ్‌ పాండే ఆదుకున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు. అతడికి విజయ్‌ శంకర్‌ చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలో 28 బంతుల్లో అర్ధశతకం చేసిన పాండే.. సిక్సర్లతో విజృంభించి లక్ష్యాన్ని కరిగించాడు. ఇన్నింగ్స్‌ ప్రారంభంలో నెమ్మదిగా ఆడిన శంకర్‌ కూడా చివరకు బ్యాట్‌కు పనిచెప్పి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 140 పరుగులు జోడించి జట్టుకు విజయాన్నందించారు. రాజస్తాన్‌ బౌలర్లలో ఆర్చర్​కు రెండు వికెట్లు దక్కాయి.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...