20.4 C
Hyderabad
Sunday, January 24, 2021

రాజస్థాన్ రాయల్స్‌పై ఢిల్లీ విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అన్ని విభాగాల్లో సూపర్ ఫర్ఫామెన్స్ చేస్తూ.. విజయాలను ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థికి స్వల్ప లక్ష్యాన్ని విధించినా..అద్భుతంగా కట్టడి చేసి..విజయాన్ని సొంతం చేసుకుంది.

ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన మొదటి ఓవర్‌లో మొదటి బంతికే పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన రహానే కూడా ఆర్చర్‌ బౌలింగ్ లోనే అవుట్‌ అయ్యాడు. దీంతో ఢిల్లీ 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రహానే అవుట్‌తో క్రీజులోకి వచ్చిన అయ్యర్‌..ధవన్ తో కలిసి ఇన్నింగ్స్‌ ను నడిపించాడు. ఇదే స్థితిలో ధవన్‌ 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే కాసేపటికే క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు . ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌ కళాత్మక షాట్లతో  అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అయ్యాక విజృంభిస్తాడనుకున్న అయ్యర్‌.. త్యాగి బౌలింగ్‌లో పెవిలీయన్ చేరాడు. అయ్యర్‌ వెనుదిరిగాక రాజస్తాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. చివర్లో ఉనద్కట్‌ వేసిన ఓవర్లో ఒక బౌండరీ రావడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ మూడు వికెట్లు తీసుకున్నాడు.

162 పరుగుల టార్గెట్‌ తో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ ను ఓపెనర్లు జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌ అద్భుతంగా ఆరంభించారు. వీరి సూపర్ బ్యాటింగ్ తో రాజస్తాన్‌ జట్టు మూడు ఓవర్లలోనే 37 పరుగులు సాధించింది. అయితే జోష్ మీదున్న బట్లర్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్‌ స్మిత్‌ ను అశ్విన్‌ బోల్తా కొట్టించాడు. ఆ తరుణంలో స్టోక్స్‌ కు శాంసన్‌ జత కలిశాడు. మిరకిల్ చేస్తాడుకున్న స్టోక్స్‌ ను తుషార్‌ దేశ్‌పాండే పెవిలీయన్ చేర్చాడు. ఆపై స్వల్ప వ్యవధిలో శాంసన్‌  ఔటయ్యాడు. ఇక మెరుపులు మెరిపించి హోప్స్ పెంచినరాబిన్‌ ఉతప్ప అన్రిచ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.  ఫాంలో ఉన్న తెవాటియా చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నా రాజస్థాన్ ను గెలిపించలేకపోయాడు. దీంతో రాజస్తాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్, దేశ్‌పాండేలు తలో రెండు వికెట్లు సాధించగా, రబడా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లు తలో వికెట్‌ తీశారు.

రెండు కీలక వికెట్లు తీసుకుని ఢిల్లీ విజయంలో కీ రోల్ ప్లే చేసిన అన్రిచ్ మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ సీజన్ లో రాజస్థాన్ తో ఆడిన రెండు మ్యాచుల్లో ఢిల్లీనే విజయం సాధించడం విశేషం.

- Advertisement -

Latest news

Related news

తమిళ చరిత్ర మోదీకి అర్థం కాదు.. రాహుల్

భార‌త్‌లో ఒకే భాష‌, ఒకే సంస్కృతి, ఒకే ఐడియా ఉండాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ న‌మ్ముతార‌ని రాహుల్ గాంధీ విమర్శించారు. యావ‌త్ దేశం ఒకే ఒక వ్య‌క్తిని పూజించాల‌ని ప్ర‌ధాని...

త్వరలోనే కొత్త ఐటీ పాలసీ.. కేటీఆర్

తెలంగాణ ఐటీ పాలసీ అద్భుతమైన ఫలితాలు అందించిందని, త్వరలోనే కొత్త ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ ఐటీ పాలసీకి త్వరలో...

స్టేజీపైనే కుప్పకూలిన ప్రదీప్ డైరెక్టర్

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాకు మున్నా దర్శకత్వం వహించారు. జనవరి 29న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రెస్ మీట్...

తెలంగాణలో పెరిగిన సాగు విస్తీర్ణం.. సీఎం కేసీఆర్

తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోనే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగయ్యేదని, ఇప్పుడు...