23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

తొలి ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా ఆలౌట్

బ్రిస్బేన్ లో జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 రన్స్ కు ఆలౌటైంది. శనివారం ఉదయం 274/5 స్కోర్‌తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 95 పరుగులు చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ టిమ్‌పైన్‌(50), కామెరూన్‌ గ్రీన్‌(47) రాణించారు. టిమ్‌పైన్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక శార్దుల్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న రోహిత్‌ చేతికి చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే వాషింగ్టన్‌ సుందర్‌ గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్‌ చేశాడు. మళ్లీ మరుసటి ఓవర్‌లోనే శార్దుల్‌ కమిన్స్‌(2)ను కూడా ఔట్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. లైయన్‌(24), మిచెల్‌ స్టార్క్‌(20*) ధాటిగా ఆడి స్కోర్‌ను 350 దాటించారు. చివర్లో హేజిల్‌వుడ్‌(11) పోరాడటంతో ఆస్ట్రేలియా 369 పరుగులు చేయగలిగింది. మన బౌలర్లలో శార్దుల్‌, వాషింగ్టన్‌, నటరాజన్‌ మూడేసి వికెట్లు, సిరాజ్‌ ఒక వికెట్‌ తీశారు.

- Advertisement -

Latest news

Related news