భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు చివరి రోజు ఆట రసవత్తరంగా జరిగింది. ఇంగ్లండ్ జట్టు ఇచ్చిన 420 పరుగుల రికార్డు ఛేదన కోసం భారత్ పోరాటానికి దిగింది. ప్రస్తుతానికి రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో గిల్ (15 బ్యాటింగ్), పుజార (12 బ్యాటింగ్) ఉన్నారు. తొలి టెస్టు గెలవాలంటే ఈ రోజు 381 చేయాలి. ఒకేరోజు 381 పరుగులు చేయడం దాదాపు అసాధ్యం అని నిపుణులు చెప్తున్నారు. మరి అనుకోని విధంగా ఆడి గెలిపిస్తారో.. కనీసం డ్రా చేసే దిశగా అయినా ప్లాన్ చేస్తారో చూడాలి.
నిన్న జరిగిన మ్యాచ్ లో అశ్విన్ వందేళ్ల రికార్డుని బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 114 సంవత్సరాల తర్వాత ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన స్పిన్నర్‌గా అశ్విన్ నిలిచాడు. అంతకుముందు 1907లో బెర్ట్ వాల్గర్ ఈ రికార్డు సాధించాడు.
