ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ని ఆలస్యంగా నిర్వహించడంతోనే ఆటగాళ్లకు గాయాలు అవుతున్నాయని ఆస్ట్రేలియా చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే తాను ఐపీఎల్‌ను తప్పు బట్టడం లేదని.. కేవలం ఐపీఎల్ ప్రారంభించిన సమయాన్ని మాత్రమే తప్పుబడుతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.
‘వన్డే సిరీస్, టీ20 మా జట్టు తరపున డేవిడ్ వార్నర్, మార్కస్ స్టొయినిస్‌లు గాయపడగా.. టెస్టు సిరీస్‌కు ముందే కామెరాన్ గ్రీన్, విల్ పకోవ్‌స్కీ గాయాలతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లలో షమీ, ఉమేశ్, జడేజా, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రాలు గాయపడ్డారు. దీంతో పాటు తొడ కండరాలు పట్టేయడంతో టీమిండియా కీలక స్పిన్నర్ అశ్విన్ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు’ అని చెప్పుకొచ్చాడు.
ఆసీస్, టీమిండియాల మధ్య జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోపీలో భాగంగా జనవరి 15 నుంచి బ్రిస్బేన్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది.
