బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో మూడో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసిసే సమయానికి ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ (67), స్టీవ్ స్మిత్ (31) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ చెరో వికెట్ పడగొట్టారు.
గురువారం ఉదయం వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ఆట ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ గట్టి షాక్ ఇచ్చాడు. అద్భుత బంతితో స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. అర్ధశతకం పూర్తి చేసుకున్న పకోస్కీని నవదీప్ సైనీ పెవిలియన్ కు పంపాడు.