బార్డర్-గవాస్కర్ ట్రోపిలో భాగంగా సిడ్నిలో జరుగుతున్న మూడవ టెస్టులో ఆస్ట్రేలియా పటిష్టమైన స్థితిలో ఉంది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన రెండవ ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 103 రన్స్ చేసింది. దీంతో ఆసీస్ 197 పరుగుల ఆధిక్యంలో సాధించింది. లబుషేన్ 47, స్మిత్ 27 రన్స్‌తో బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకుముందు ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగడంతో ఇండియా తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 244 పరుగులు చేసి ఆలౌటైంది. భారత జట్టులో పూజారా 50 రన్స్ చేశాడు. అయితే రెండవ సెషన్లో పంత్, పుజారాలు త్వరత్వరగా ఔట్ కావడంతో.. భారత ఇన్నింగ్స్ కుంటుపడింది. చివర్లో జడేజా 28 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డ రిషబ్ పంత్‌ను స్కానింగ్‌కు తీసుకువెళ్లినట్లు బీసీసీఐ చెప్పింది. రవీంద్ర జడేజా బొటనవేలుకు గాయం కావడం వల్ల ఫీల్డింగ్ చేయలేదు.
స్కోరు బోర్డు.. ఆస్ట్రేలియా 338 & 103/2; ఇండియా 244