ఇండియన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పై ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. గబ్బా స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 44 రన్స్ చేసిన రోహిత్ వికెట్ ని లైయన్ తీయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. దీంతో రోహిత్‌ను టెస్టుల్లో అత్యధిక సార్లు ఔట్ చేసిన బౌలర్‌గా లైయన్ రికార్డు నెలకొల్పాడు. అంతకు ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా బౌలర్ కగిసో రబాడ (5 సార్లు) ఉంది.
బ్రిస్బేన్ టెస్టుతో ఆస్ట్రేలియా తరపున 100 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తి చేసిన 13వ ఆస్ట్రేలియా ఆటగాడిగా లైయన్ నిలిచాడు. పదేండ్ల కెరీర్లో.. 100 టెస్టుల్లో 397 వికెట్లతో లైయన్ కొనసాగుతున్నాడు. ఇంకో మూడు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా తరఫున 400 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. అతడికన్నా ముందు షేన్ వార్న్ (708), గ్లెన్ మెక్‌గ్రాత్ (563) ఉన్నారు.