టర్బొనేటర్ హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే)తో బంధం ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 2018 నుంచి 2020 వరకు చెన్నై తరఫున భజ్జీ బరిలో దిగాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాడు. 2018 వేలంలో చెన్నై రూ.2కోట్లకు హర్భజన్ ను దక్కించుకుంది.
‘చెన్నైతో నా రెండేళ్ల ఒప్పందం పూర్తయింది. గొప్ప స్నేహితులను చెన్నై టీం అందించింది. రెండేళ్ల పాటు నాకు అండగా నిలిచిన టీం మేనేజ్ మెంట్ కు, అభిమానులకు థ్యాంక్స్.’ అని భజ్జీ ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ లో 160 మ్యాచ్ లు ఆడిన భజ్జీ 7.05 సగటుతో 150 వికెట్లు తీశాడు. 137.22 స్ట్రైక్ రేట్ తో 829 పరుగులు చేశాడు.