29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

టీంఇండియా గెలుపుపై ప్రముఖుల స్పందన

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ నాలుగో టెస్టులో విజయం సాధించిన టీంఇండియాపై పీఎం నరేంద్ర మోడీతో సహా క్రికెట్ దిగ్గజాలు స్పందించారు.

‘టీంఇండియా విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ గెలుపు దేశానికి గర్వకారణం’ అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీటారు. అలాగే వారి భవిష్యత్ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

‘అడిలైడ్ టెస్ట్ ఓటమి త‌ర్వాత మా సామ‌ర్థ్యాన్ని శంకించిన వాళ్లంతా ఒక్క‌సారి ఈ విజ‌యాన్ని చూడండి. ఈ హిస్టారికల్ విన్ ని ఆస్వాదించండి.’ అంటూ టీంఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు.

‘ప్రతి సెషన్‌కి కొత్త హీరో వచ్చాడు. ప్రతీసారి విజయం సాధించాం. గాయాల్ని, ఇతర సమస్యలను అధిగమించి విశ్వాసంతో విజయం సాధించాం’ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్ ట్వీట్‌ చేశారు. 

‘హిస్టారిక్ సిరీస్ విజయం. యంగ్ స్టార్స్ చూపిన తెగువ అద్భుతం. గిల్, పంత్ అద్భుతంగా రాణించారు. టీంఇండియాకు హ్యాట్సాప్.’ అని క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పందించారు.

‘గొప్ప టెస్ట్ సిరీస్‌లో ఒకటి ఎప్పుడూ గెలుస్తుంది. విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు’ అని టెక్‌ దిగ్గజం సుందర్‌ పిచాయ్‌ ట్వీటారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ని  2-1తో విజయం సాధించి టీమిండియా వరుసగా రెండోసారి ట్రోఫీని నిలబెట్టుకుంది.

- Advertisement -

Latest news

Related news