అబుదాబి టీ10 లీగ్‌లో వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయి నయా రికార్డు నెలకొల్పాడు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో అబుదాబి టీమ్ తరపున బ్యాటింగ్ చేసిన గేల్ మరాఠా అరేబియన్స్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 22 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ఇందులో 6ఫోర్లు, 9సిక్సర్లు ఉండటం విశేషం. యూనివర్స్ కేవలం 12 బంతుల్లోనే పూర్తి అర్ధసెంచరీ కొట్టి చేసి టీ10 చరిత్రలో గతంలో నమోదైన వేగవంతమైన రికార్డును సమం చేశాడు. 2018 సీజన్లో రాజ్‌పుత్ జట్టు ఆటగాడు మహ్మద్ షాజాద్ ఫాస్టెస్ట్ అర్ధశతకం సాధించాడు.