స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ణారణ అయింది. సైనాతోపాటు మరో ఇండియన్ షట్లర్ ప్రణయ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. కొద్ది రోజుల క్రితమే సైనా కరోనా నుండి కోలుకోగా.. ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ వచ్చింది. సైనా తొలి రౌండ్లో మలేసియాకు చెందిన షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని బీడబ్ల్యూఎఫ్ కోరింది. ప్రస్తుతం సైనాతోపాటు మరో ఇండియన్ షట్లర్ ప్రణయ్ బ్యాంకాక్ ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉన్నారు. నేటి నుండి థాయిలాండ్ ఓపెన్ సూపర్ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు క్రీడాకారులందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.