29.3 C
Hyderabad
Monday, March 1, 2021

మహేష్ బాబు పాటకు వార్నర్ డ్యాన్స్ .. వీడియో వైరల్

టాలీవుడ్ హీరోల్లా కన్పించేందుకు, డ్యాన్స్ చేసేందుకు, డైలాగులు చెప్పేందుకు ఆసక్తి చూపే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డెవిడ్ వార్నర్ తాజాగా రిలీజ్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రీఫేస్ యాప్ ద్వారా అమితాబ్, ప్రభాస్, రజినీకాంత్, చిరంజీవి ఇలా స్టార్ హీరోల్లా మారి వీడియోలు చేస్తు వదులుతున్నాడు. తాజాగా ఈ స్టార్ క్రికెటర్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాలోని ‘పాల పిట్ట’ సాంగ్‏కు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో వార్నర్ తన భార్య పిల్లలతో కలిసి చేసిన బుట్టబొమ్మ సాంగ్ స్టెప్పులు ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Latest news

Related news