32.7 C
Hyderabad
Monday, March 1, 2021

జో రూట్ సెంచరీ.. తొలిరోజు ఇంగ్లాండ్ దే పైచేయి

100వ టెస్ట్ ఆడుతున్నఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ సెంచ‌రీ కొట్టడంతో తొలి రోజు ఆటలో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. ఆట ముగిసే స‌మ‌యానికి 3 వికెట్లకు 263 ప‌రుగులు చేసింది. టెస్టుల్లో 20వ సెంచ‌రీ నమోదు చేసిన రూట్… ఆట ముగిసే స‌మ‌యానికి 128 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నాడు. ఓపెన‌ర్ సిబ్లీ 87 పరుగులు చేశాడు. ఇండియా బౌల‌ర్ల‌లో బుమ్రా 2, అశ్విన్ ఒక వికెట్ తీశాడు.

భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ఈరోజు నుంచి చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

- Advertisement -

Latest news

Related news