32.3 C
Hyderabad
Thursday, February 25, 2021

గబ్బాలో ఆసిస్‌కు అబ్బా అనిపించారు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనదే

బ్రిస్బెన్‌ వేదికగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు సాధించింది. 328 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్‌ ముందు ఉంచిన ఆసీస్‌కు భారత బ్యాట్స్‌మెన్స్‌ గట్టిగానే సమాధానం చెప్పారు. పెనర్‌‌ రోహిత్‌ శర్మ 7 పరుగులకే వెనుదిరగగా.. యువ బ్యాట్స్‌మెన్‌‌ గిల్‌ అద్భుతమైన ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించి.. 91 పరుగుల వద్ద వెనుదిరిగాడు. మూడో సెషన్ పూర్తయ్యే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. మరో 25 ఓవర్లలో 110 పరుగులు చేయాల్సి ఉండగా.. రిషబ్ పంత్ 89(138), చటేశ్వర్ పుజారా 56(211) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభిస్తున్నప్పటికీ పంత్, పుజారా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోర్‌ను పెంచుతూ పోయారు. పుజారా 56 దగ్గర ఔట్ అవ్వగా.. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్22(29), పంత్ లు కలిసి మ్యాచ్ ను టీ20 ను తలపించేలా ఆడి.. డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ రిషభ్‌ పంత్‌ దగ్గరుండి టీమ్ గెలుపు బాధ్యతలు తీసుకున్నాడు.
నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్-ఆస్ట్రేలియా చెరో మ్యాచ్‌లో గెలవగా ఒక మ్యాచ్ డ్రా అయింది. ఈ మ్యాచ్‌ గెలవడంతో టీమిండియా సిరీస్ విన్ అయ్యి, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కైవసం చేసుకుంది.

గబ్బాలో అబ్బా అనిపించారు
గబ్బా పిచ్‌లో ఆసీస్ కు ఇప్పటివరకూ ఓటమనేదే లేదు. దశాబ్దాలుగా ఆ పిచ్‌లో ఆసీస్‌ను ఓడించిన దేశమే లేదు. ఇదే విషయాన్నే మ్యాచ్ ముందు చాలామంది ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లు కూడా కామెంట్ చేశారు. అన్ని అంచనాలను తలక్రిందులూ చేస్తూ భారత్ హిస్టారికల్ విక్టరీ సాధించింది.

- Advertisement -

Latest news

Related news