23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

నాన్న ఉంటే సంతోషించేవారు.. సిరాజ్

నన్ను ఈ స్థాయికి తెచ్చేందుకు నాన్న ఎంతో కష్టపడ్డారని, నాన్న కలను నిజం చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఇండియన్ క్రికెట్ స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్ అన్నాడు. ఈ రోజు మీడియాలో తన ఆస్ట్రేలియా అనుభవాలను పంచుకున్నారు.  ఆస్ట్రేలియాలో తీసిన ప్రతి వికెట్ నాన్నాకే అంకితమని, వికెట్ తీసిన ప్రతిసారి నాన్నే గుర్తు కొచ్చాడన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టుల్లో 13 వికెట్లు తీసినా అందులో లబుషేన్ వికెట్ నా పెవరేట్ అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా నాన్న మరణం నన్ను మరింత కుంగదీసిందన్నాడు.

ఆస్ట్రేలియా ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు బాధించాయని, జాతి వివక్ష వ్యాఖ్యలు నన్ను మరింత రాటు దేల్చాయన్నాడు. టెస్టు సిరీస్ లో అత్యధిక వికెట్లు తీయడం సంతోషకరమన్నాడు.  బుమ్రా గాయపడిన తర్వాత నా పై అదనపు భారం పడిందని, టీంఇండియా లీడ్ బౌలర్ గా రాణించడం ఎప్పటికీ మర్చిపోనన్నాడు. ఐపీఎల్ ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి తోడ్పాటు మరువలేనిది అంటూనే బుమ్రా మంచి సపోర్టు ఇచ్చాడన్నాడు. టీంఇండియా తరపున భవిష్యత్ లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యమన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో అభిమానులు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలియజేశాడు.

‘దేశం కోసం ఆడాలి.. దేశం కోసం మ్యాచ్‌ల‌ను గెల‌వాలి’ అన్న తన తండ్రి మాటలు గుర్తుకు వచ్చినందునే జాతీయ గీతం ఆల‌పి‌స్తున్న స‌మ‌యంలో కండ్లలో నీళ్లు వచ్చాయన్నాడు.  మహమ్మద్ సిరాజ్ గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఖైరతాబాద్ గ్రేవ్ యార్డులోని తన తండ్రి మహమ్మద్ గౌస్ సమాధి వద్దకు వెల్లి నివాళులర్పించారు.

- Advertisement -

Latest news

Related news