ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు టీంఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ఐసీసీ ట్విటర్ ద్వారా ప్రకటించింది. జనవరిలో తన అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్లను వెనక్కి నెట్టాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ లో రిషబ్ తన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. సిడ్నీ టెస్ట్ లో 97 పరుగులు చేసిన పంత్, బ్రిస్బేన్ టెస్ట్ లో 89 రన్స్ చేసి టీంఇండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ రెండు టెస్టుల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో పంత్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని ఐసీసీ కొనియాడింది.