మొన్న ఆసిస్ గడ్డపై హిస్టారికల్ విన్ తర్వాత టీమిండియా ఇప్పుడు సొంత గడ్డలో ఇంగ్లండ్ తో పోటీ పడనుంది. ఇవాళ్టి నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఫలితాలను బట్టి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌ను డిసైడ్ అవుతుంది. చెన్నై వేదికగా రెండు టీమ్స్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. చెన్నై పిచ్ స్పిన్నర్స్‌కు బాగా అనుకూలం. చెన్నైలో ఐదు రోజులు పొడి, తేమ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మ్యాచ్ చివరి రెండు రోజులు ఆకాశం మేఘావృతమై ఉండొచ్చని అధికారులు తెలిపారు.