23.8 C
Hyderabad
Sunday, February 28, 2021

తొలిటెస్టులో టీమిండియా ఓటమి

ఇంగ్లాండ్ తో చెన్నైలో జరుగుతున్న నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది. 39 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఐదోరోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. మిడిలార్డర్ పేలవ ప్రదర్శనతో.. 187 పరుగులకే ఆలౌట్ అయింది.

232 పరుగుల తేడాతో ఘోర ఓటమిని మూట గట్టుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 72, గిల్ 50 పరుగులు చేయగా.. మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. లీచ్ నాలుగు వికెట్లు, అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టి టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశారు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0తో ఆధిక్యంలో ఉంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు జో రూట్ ఎంపికయ్యాడు.

- Advertisement -

Latest news

Related news