17 C
Hyderabad
Monday, March 1, 2021

టీమిండియా ఆలౌట్.. స్కోర్స్ ఎంతంటే..

గబ్బాలో జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్సులో టీమిండియా ఆలౌట్ అయ్యింది. 111.4 ఓవర్లలో 336 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ 33 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. స్టార్క్, కమ్మిన్స్ చెరో రెండు వికెట్లు, లియాన్ ఒక వికెట్ తీశారు.
62/2 స్కోర్ దగ్గర మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. 186 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. పుజారా(25), రహానే(37), మయాంక్ అగర్వాల్(38), రిషబ్ పంత్(23) అవుట్ అవ్వగా బౌలర్లు శార్దుల్(67) సుందర్(62)లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోర్ 309 పరుగుల దాకా తీసుకొచ్చారు. జట్టు స్కోర్‌కు మరో ఎనిమిది పరుగులు జోడించి చివరి వికెట్ గా సిరాజ్ పెవిలియన్ చేరాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

- Advertisement -

Latest news

Related news