29.3 C
Hyderabad
Monday, March 1, 2021

మంత్రి కేటీఆర్ ను కలిసిన హనుమ విహారి

టీమిండియా బ్యాట్స్ మెన్ హనుమ విహారి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఆస్ట్రేలియా గడ్డపై మంచి ప్రదర్శన కనబరిచిన విహారిని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం శాలువ కప్పి సన్మానించారు. ఆస్ట్రేలియా టూర్ గురించి కేటీఆర్ హనుమ విహారిని అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌తో దిగిన ఫొటోను  పోస్ట్ చేస్తూ.. కేటీఆర్ ని కలవడం,  క్రికెట్ గురించి సంభాషించడం చాలా ఆనందంగా ఉందని విహారి ట్విటర్లో పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో  అద్భుత డిఫెన్స్‌తో ఆకట్టుకున్న హనుమ విహారీ , రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ డ్రాగా ముగియడంలో  కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కండరాల గాయం కారణంగా విహారి ఆఖరి టెస్టు జట్టు నుంచి దూరమై.. స్వదేశం చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టును టీమిండియా డ్రా చేయడం పట్ల మంత్రి ట్విట్టర్లో స్పందించారు. టెస్టు డ్రా..ఇన్నింగ్స్‌ విజయం కన్నా బాగుందని ప్రశంసించారు. 

- Advertisement -

Latest news

Related news