33.1 C
Hyderabad
Sunday, February 28, 2021

ఐపీఎల్ 2021 వేలం వేదిక ఫిక్స్

ఐపీఎల్-2021 సీజన్ కు సంబంధించి బీసీసీఐ వేలాన్ని చైన్నైలో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18న ఆటగాళ్ల వేలం ఉంటుందని బీసీసీఐ ట్విట్టర్లో ప్రకటించింది. జనవరి 20తో ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియగా.. పలువురు ప్లేయర్స్ ను  ఫ్రాంచైజీలు వదులుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4తో ఐపీఎల్ జట్ల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ విండో ముగియనుంది. ప్రస్తుతానికి ఐపీఎల్ జట్లు 139 మంది ఆటగాళ్లను తీసుకోగా.. ఇంకా 55 మంది వేలానికి అందుబాటులో ఉన్నారు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ని ఇక్కడే నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.

వేలంలో ఉన్న ప్రముఖ ఆటగాళ్లు..

కేదార్ జాదవ్, మురళీ విజయ్, హర్భజన్ సింగ్, పియూష్ చావ్లా, గ్లెన్ మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, వరుణ్ ఆరోన్, క్రిస్ మోరిస్, శివం దూబే, ఆరోన్ ఫించ్, ఉమేష్ యాదవ్, మొయిన్ అలీ, పార్థివ్ పటేల్.

- Advertisement -

Latest news

Related news