29.3 C
Hyderabad
Monday, March 1, 2021

ఫిబ్రవరిలో ఐపీఎల్ 2021 వేలం!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వేలం వాయిదా పడింది. జనవరి చివరి వారంలో ఐపీఎల్ 2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల వేలం నిర్వహించాలని ఇదివరకే బీసీసీఐ షెడ్యూల్ వేసింది. కానీ, చివరి నిమిషంలో ఈ వేలం వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. తిరిగి వేలం ఫిబ్రవరి 18న నిర్వహేంచే అశకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు. వేలానికి సంబంధించి ఇంకా టైం, వేదిక నిర్ణయించలేదన్నాడు.

వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ టీమ్స్ ఇప్పటికే పలువురు ఆటగాళ్లను రిలీజ్ చేశాయి. కొత్త ఆటగాళ్ల కోసం వేలంలో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌ ఇండియాలో  జరుగుతుందా లేదా అనే విషయంపై బీసీసీఐ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.  వచ్చే నెల నుంచి సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్‌  జరుగనున్న నేపథ్యంలో ఐపీఎల్ వచ్చే సీజన్ కూడా ఇక్కడే నిర్వహించే అవకాశాలు అధికంగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.  

- Advertisement -

Latest news

Related news