29.8 C
Hyderabad
Sunday, February 28, 2021

ఏ టీమ్ దగ్గర ఎంత ఉన్నాయంటే..

చెన్నైలో ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు దాదాపుగా 1097 మంది క్రికెటర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. వెస్టిండీస్ నుంచి 56, ఆస్ట్రేలియా నుంచి 42, దక్షిణాఫ్రికా నుంచి 38 ఎంట్రీలు వచ్చాయి. క్యాప్డ్, అన్ క్యాప్డ్ ఆటగాళ్లు అందరూ కలిపి 1097 మంది ఉండగా.. అందులో భారత ఆటగాళ్లు 814 మంది, విదేశీ ఆటగాళ్లు 283 మంది ఉన్నారు. ఈసారి ఆక్షన్ లో సచిన్ కొడుకు కూడా ఉండడం విశేషం.

ఈ నెల18న మధ్యాహ్నం 3 గంటలకు వేలం మొదలవుతుంది. ఇందులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అధికంగా రూ. 53.20 కోట్లతో వేలానికి దిగుతుండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రూ. 35.90 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ. 34.85 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ రూ. 22.90 కోట్లు, ముంబై ఇండియన్స్ రూ. 15.35 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ రూ. 12.9 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు చెరో రూ. 10.75 కోట్లతో బరిలోకి దిగనున్నాయి.

- Advertisement -

Latest news

Related news